UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- September 24, 2025
యూఏఈ: అమెరికా H-1B వీసా రుసుము పెంపు నిర్ణయంతో యూఏఈ గోల్డెన్ వీసాతోపాటు ఫ్రీలాన్స్ వీసా మరియు రిమోట్ వర్క్ వీసాలకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా నుంచి యూఏఈ గోల్డెన్ వీసా గురించిన ఎంక్వైరీలు పెరిగాయని ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ గౌరవ్ కేస్వానీ పేర్కొన్నారు. H-1B మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లను అధిక H-1B వీసా రుసుము షాక్ కి గురిచేసిందని, దాంతో వారు యూఏఈలో గోల్డెన్ వీసాలను పొందేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
యూఏఈ ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన దేశంగా ఉందని, అమెరికాలో ఉన్న జీవనశైలి, ఆర్థిక వ్యవస్థను పోలి ఉంటుందని అన్నారు. దాంతో యూఏఈకి వచ్చేందుకు భారతీయ నిపుణులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులకు యూఏఈ ఒక ఆకర్షణీయమైన దేశంగా ఎంపికలో తొలివరుసలో ఉందన్నారు. ఇతర దేశాల్లో రెసిడెన్సీ-బై-ఇన్వెస్ట్‌మెంట్ మరియు రిమోట్ వర్క్ ప్రోగ్రామ్‌లు ఉన్నప్పటికీ, ఈ విషయంలో యూఏఈ ప్రత్యేకంగా నిలుస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







