న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- September 24, 2025
న్యూయార్క్: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది న్యూయార్క్ లో బిజిబిజీగా గడిపారు. అనేక దేశాల విదేశాంగ మంత్రులను కలిశారు. ఆయా దేశాలతో ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడంపై వారితో చర్చలు జరిపారు.
సముద్ర రంగంలో సహకారం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గురించి సైప్రస్ విదేశాంగ మంత్రితో చర్చించారు. అనంతరం కొలంబియన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ సంప్రదింపులపై కుదిరిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఒమన్-కొలంబియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఉత్తర మాసిడోనియా ప్రతినిధితో సమావేశమైన సయ్యద్ బదర్.. పరస్పర సహకార రంగాలను గుర్తించడం, ద్వైపాక్షిక సంబంధాల పరిధిని విస్తృతం చేయడం గురించి చర్చించారు. చివరగా బురుండి ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యారు. రాజకీయ సంప్రదింపులకు సంబంధించిన ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుదేశాల అభివృద్ధికి దోహదపడే అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, ఒమన్ అధికార ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







