మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!

- September 24, 2025 , by Maagulf
మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!

మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదు, మదీనాలో సౌదీ అరేబియా దివంగత గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దులాజీజ్ అల్-షేక్‌ అంత్యక్రియలకు ముందు నిర్వహించే అసర్ ప్రార్థనలు నిర్వహించారు.   ఈ ప్రార్థనల్లో మదీనా ఎమిర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ సుల్తాన్ తోపాటు అనేక మంది ప్రాంతీయ ఎమిర్లు, డిప్యూటీ ఎమిర్లు, గవర్నర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇస్లామిక్, అరబ్ ప్రపంచానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.        

సౌదీ గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దులాజీజ్ అల్-షేక్ మృతి పట్ల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల రూలర్స్..పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ కు తమ సంతాపాన్ని తెలియజేశారు. గ్రాండ్ ముఫ్తీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com