మార్చిలో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’
- February 18, 2021
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం మార్చి నెలలో జరుగనుంది. పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులలో భయాందోళనలను తొలగించడానికి ప్రధాని 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ సమావేశం కరోనా వల్ల కొంత ఆలస్యమయ్యింది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ విధానంలో విద్యార్థులతో ప్రధాని ముచ్చటిస్తారని విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.ఈ సమావేశం మార్చి నెలలో జరుగుతుందని, తేదీలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. కాగా, ఈ ఏడాది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా అనుమతించనున్నారు.
కాగా, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని, మార్చి 14 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న విద్యార్థులు http://www.innovateindia.mygov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన థీమ్‌లలో 500 పదాలకు మించకుండా తమ ప్రశ్నలను పంపించాలని చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష