డి.రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి

- February 18, 2021 , by Maagulf
డి.రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి

హైదరాబాద్:గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు అండ్ పలువురు రామానాయుడు కి ఘన నివాళులు అందించారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు.అయితే ఫ్రిబ్రవరి 18 న రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్ లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ  కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి ఘనమైన నివాళులు ఘటించారు. 

ఈ సంధర్భంగా కాజా సత్య నారాయణ మాట్లాడుతూ "ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు, అయన చేసిన సేవలు వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్ ఇంతమందికి జీవన అధారంగా నిలిచింది అని కొనియాడారు.కాబట్టే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ప్రతిరోజు స్మరించుకుంటున్నాం.మాకు రామానాయడు  జన్మదినాన్ని అలాగే వర్ధంతిని కూడా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com