'మనుచరిత్ర' పోస్టర్ విడుదల
- February 18, 2021
హైదరాబాద్:'పెళ్ళిచూపులు, మెంటల్ మదిలో' వంటి రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ను నిర్మించిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ గత యేడాది 'చూసీ చూడంగానే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా విడుదలకు ముందే రెండు, మూడు సినిమాలకూ కమిట్ అయ్యాడు. అందులో ఒకటి 'గమనం'. శ్రియా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్. సంజనా రావు దర్శకురాలు. ఇళయరాజా స్వరాలు అందిస్తున్న 'గమనం' ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే... భరత్ కుమార్ పి. దర్శకత్వంలో 'మను చరిత్ర' అనే చిత్రంలోనూ శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. విశేషం ఏమంటే... ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఆమె మేనేజర్ రాన్సన్ జోసఫ్ తో కలిసి, ఎన్. శ్రీనివాసరెడ్డి 'మనుచరిత్ర' మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. గోపీసుందర్ దీనికి సంగీత దర్శకుడు. ఇక ఆ మధ్య శివ కందుకూరి నటిస్తున్న నాలుగో సినిమా 'చేతక్ శీను' సైతం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. విభిన్న కథాంశాలున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నటుడిగానూ ఈ యువ కథానాయకుడు మంచి గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష