కువైట్:మరోసారి తెరపైకి విదేశాలకు నగదు బదిలీపై పన్ను విధింపు అంశం
- February 19, 2021
కువైట్ నుంచి విదేశాలకు చేసే నగదు బదిలీపై పన్నులను విధించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్ని విదేశీ నగదు బదిలీలపై పన్నులను విధించటంపై స్పందించిన పార్లమెంట్ సభ్యుల కమిటీ...నగదు బదలీ పన్ను విధానాన్ని కేవలం ప్రవాసీయులకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేసింది. దేశ పౌరులు నిర్వహించే నగదు బదిలీలపై ఎలాంటి పన్నులు ఉండొద్దని అంటోంది. అయితే..విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధించే అంశంపై భిన్నాప్రాయాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను మంత్రి మండలి గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, జాతీయ అసెంబ్లీ, చట్టసభ్యుల కమిటీ విదేశాలకు నగదు బదిలీలపై పన్ను విధింపు విధానాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే..ఇది కేవలం ప్రవాసీయులకు మాత్రమే వర్తింప చేయాలని, అందులోనూ వివిధ వర్గాలను, నగదు బదిలీ అంశాలను బేస్ చేసుకొని పర్సేంటేజ్ ఆధారంగా పన్ను విధించాలని అంటోంది. ఈ పన్ను విధానం నుంచి దేశ పౌరులకు, విద్యార్ధులు, గృహకార్మికులకు మినహాయింపు ఇవ్వాలని తమ డిమాండ్లో చేర్చింది. అయితే..ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది. కువైట్ చట్టాలు, ఆర్ధిక విధానాల ప్రకారం ప్రవాసీయులకు నగదు బదిలీ పన్ను విధించటం సరికాదని అంటోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







