నితిన్30 రిలీజ్ డేట్ ఫిక్స్
- February 19, 2021
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలోనే వరుసగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ చేసిన రెండు సినిమాలు రంగ్ దే, చెక్ చిత్రాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా నితిన్ కెరీర్లో చేస్తున్న 30వ సినిమా. ఈ చిత్రాన్ని హిందీ అంధాధున్ సినిమా రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూన్11 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. నితిన్ చేసిన చెక్ సినిమా ఫిబ్రవరి26, రంగ్ దే మార్చి 26న థియేటర్లలోకి రానున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో నితిన్ వరుసగా మూడు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష