దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ని సందర్శించిన మహేష్ బాబు
- February 19, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది.ఈ షెడ్యూల్‌లో మహేష్, కీర్తి సురేష్‌లపై సాంగ్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు టాక్.అయితే కొద్ది రోజులుగా దుబాయ్‌లోని పలు ప్రాంతాలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ వస్తున్న మహేష్ తాజాగా దుబాయ్ పోలీస్ స్టేషన్‌ను చూపించారు.
గురువారం లా మెర్‌లోని దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ (SPS) ను గురువారం సందర్శించారు మహేష్ బాబు.లా మెర్ స్టేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్, ఇది మనుషులతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలను అందిస్తుంటుంది స్టేషన్‌ను సందర్శించిన అనంతరం వీడియో విడుదల చేసిన మహేష్ ఈ టెక్నాలజీను చూసి మురిసిపోయాను.ఇలాంటిది గతంలో ఎప్పుడు చూడలేదు.ప్రపంచంలోనే ఇది మొదటిది.అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







