కైరా, సారా అలీఖాన్ తో విజయ్ దేవరకొండ జల్సా
- February 21, 2021
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా వలన చిత్ర షూటింగ్‌కు కొన్నాళ్లు బ్రేక్ పడడంతో స్పీడ్ పెంచారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 9న మూవీని విడుదల చేయబోతున్నారు.
లైగర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు తమ టీం షూటింగ్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలియజేస్తూ ఉంటుంది. ఇటీవల బైక్‌పై విజయ్ దేవరకొండతో బైక్‌పై షికారుకు వెళుతున్నట్టు తెలియజేసిన ఛార్మి ఇప్పుడు సారా అలీఖాన్, కైరా అధ్వానీ, కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, మనీష్ మల్హోత్రా తో కలిసి దిగిన ఫోటో ఆమె ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో కి నైట్ పార్టీలో తాము ఎంతగానో ఎంజాయ్ చేశామని.. అమేజింగ్ ఫుడ్ తో పాటు అమేజింగ్ పీపుల్ ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.
Manish , thanks a ton for having us over last night.. u r a sweetheart ❤️ wat a fun night ❤️🤗 amazing food , amazing people 🤗@ManishMalhotra @karanjohar @SaraaliKKhan @TheDeverakonda @advani_kiara #purijagannadh #saturdaynight ❤️ pic.twitter.com/sx4BkcoGV4
— Charmme Kaur (@Charmmeofficial) February 21, 2021
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష