దృశ్యం-2 కి ఒకే చెప్పేసిన వెంకీ మామ..జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే!
- February 21, 2021
దృశ్యం మూవీకి సీక్వెల్‌గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోహన్‌లాల్ నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. దృశ్యం సీక్వెల్‌లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ ఆసక్తిగా లేడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది.

దృశ్యం 2 రీమేక్‌లో వెంకటేషన్ నటిస్తున్నట్టు దాదాపుగా అధికారికంగా కన్ఫామ్ అయింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్, నిర్మాత సురేష్ బాబుతో కలిసి వెంకీ దిగిన ఫొటో ఒకటి బయటపడింది. దీంతో దృశ్యం 2 రీమేక్‌లో వెంకీ నటిస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్‌ని సురేష్ బాబు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







