ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు.. కమిటీ ఏర్పాటు.. కారణం ఇదే..
- February 21, 2021
శనివారం ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో లాండింగ్ సమయంలో విమానం రన్ వేపై అదుపుతప్పి నేరుగా దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టడంతో విమానం కుడివైపు రెక్క డ్యామేజ్ అయ్యింది. గల్ఫ్‌లోని దోహా నుంచి 64 మంది ప్రయాణికులతో విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ప్రమాద ఘటనపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమిటీని నియమించింది. విమాన ప్రమాదానికి లేడీ పైలెట్ తప్పిదమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ల్యాండింగ్ సక్సెస్‌ఫుల్ గానే చేసిన లేడీ పైలెట్.. ఫ్లైట్ ని పార్కింగ్ బే లోకి తీసుకురావడంలో విఫలమైనట్లు చెబుతున్నారు. విమానాన్ని పక్కనున్న సర్వీస్ రోడ్డులోకి తీసుకు వెళ్లండతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఫ్లడ్ లైట్ పోల్‌ను మివానాం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో విమానం కుడిపక్కన రెక్క డ్యామేజ్ అయ్యింది. పోల్ కూలిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అలర్టైన అధికారులు ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించారు. ఇప్పటి వరకు ప్రమాద అంశంపై ఎలాంటి సమాచారం ఇవ్వని ఎయిర్ పోర్ట్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పైలెట్ నుంచి గోప్యంగా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష