అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ ప్రారంభించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్

- February 22, 2021 , by Maagulf
అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ ప్రారంభించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్

హైదరాబాద్:పేపర్-లెస్ విమానాశ్రయం దిశగా మరిన్ని అడుగులు వేస్తూ, జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఈ-బోర్డింగ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ షెడ్యూల్డ్ అంతర్జాతీయ క్యారియర్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పేపర్‌లెస్ ఈబోర్డింగ్‌తో అనుసంధానమయ్యాయి. తాజాగా ఎమిరేట్స్ ఈ జాబితాలో చేరింది. దుబాయికి వెళ్లే ప్రయాణీకులు, EK 527 విమానంలో ఎక్కడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ దీనిని ఉపయోగించుకుంది.

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ విమానాల ప్రయాణికులకూ మొదటి నుంచి చివరి వరకు పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్‌ను అందించిన మొదటి మరియు ఏకైక విమానాశ్రయంగా ఘనత పొందింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ నిజమైన స్ఫూర్తితో జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం 2020 డిసెంబర్ నుండి అంతర్జాతీయ విమానాలకు, స్థానికంగా అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ పరిష్కారాన్ని ప్రారంభించి, భారతదేశంలో ఆ పని చేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా మారింది.

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “ఎమిరేట్స్ ఈ-బోర్డింగ్ విధానాన్ని ఉపయోగించడం ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించిన అంతర్జాతీయ విమానయాన సంస్థలలో ఇది మొదటిది. GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభవాన్ని అందించడానికి, మరింత వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం కోసం శ్రమిస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు మా లక్ష్యమై పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించడం ప్రారంభిస్తాయని మాకు నమ్మకం ఉంది ” అన్నారు.

భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రచారానికి అనుగుణంగా, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ హైదరాబాద్ నుండి బయలుదేరే అంతర్జాతీయ ప్రయాణీకులకు ఈ-బోర్డింగ్ సేవల ద్వారా ఒక సురక్షిత ప్రయాణాన్ని కల్పించడానికి కృషి చేస్తోంది. కఠినమైన పరీక్షలలో విజయవంతమైన తర్వాత ప్రభుత్వం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాల కోసం ఇ-బోర్డింగ్ సేవలను ప్రారంభించటానికి అనుమతి ఇచ్చింది.

ఈ-బోర్డింగ్ వ్యవస్థను ఉపయోగించడానికి ప్రయాణీకులు సంప్రదాయ పేపర్ బోర్డింగ్ పాసులు లేదా తమ మొబైల్ ఫోన్లలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌లను రెండూ ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు - మెరుగైన ప్రయాణీకుల అనుభవం, విమానాశ్రయంలో క్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, చెక్ పాయింట్ల వద్ద పునరావృతాలను తొలగించడం, విమానయాన సంస్థలు తమ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. అన్ని ప్రయాణీకుల చెక్ పాయింట్ల రియల్ టైమ్ డేటా లభ్యత వల్ల విమానాశ్రయ కార్యాచరణ సామర్థ్యం మెరుగై, విమానాశ్రయం యొక్క భద్రతను పెంచడంలో సహాయపడుతుంది.

 

కోవిడ్-19 నుండి రక్షణ కోసం ఫ్లైట్ నిర్వహణ సమయంలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక స్క్రీనింగ్, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో - టెర్మినల్ ప్రవేశానికి ముందు థర్మల్ స్క్రీనింగ్, అన్ని ప్రయాణీకుల ప్రాసెసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూయింగ్ ఏర్పాట్ల ద్వారా తప్పనిసరి సామాజిక దూరం అమలు చేస్తున్నారు. ప్రయాణీకుల పరీక్షల కోసం విమానాశ్రయంలో RT-PCR  పరీక్షా కేంద్రం కూడా పనిచేస్తోంది.

 

ఇటీవల, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షిత ప్రయాణాల కోసం తీసుకున్న చర్యల నేపథ్యంలో 'ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ)' వారి ‘ఎయిర్‌పోర్ట్ హెల్త్ అక్రిడిటేషన్ 'సాధించింది. అదే కాకుండా జీఎంఆర్ యొక్క ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రయాణీకులు, వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకుని నడుచుకున్నందుకు ఏసీఐ ద్వారా ‘వాయిస్ ఆఫ్ కస్టమర్' గుర్తింపును అందుకుంది.   

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2015 డిసెంబర్‌లో దేశీయ ఈ-బోర్డింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఈ మొదటి నుంచి చివరి వరకు ఈ-బోర్డింగ్ ద్వారా ప్రతి షెడ్యూల్డ్ దేశీయ విమాన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com