షార్జా లో సరికొత్త ఆకర్షణ..వెన్నెలలో సేదతీరేందుకు డోములు..

- February 22, 2021 , by Maagulf
షార్జా లో సరికొత్త ఆకర్షణ..వెన్నెలలో సేదతీరేందుకు డోములు..

యూఏఈ: ఎడారిలో అలా సరదాగా చంద్రుడిని చూస్తూ నక్షత్రాల తళుకులమధ్య ఒక చిన్న గుడారం వేసుకొని అందులో సేదతీరితే ఆ మజానే వేరు..ఈ ఆలోచనతో మిమ్మల్ని కట్టిపడేసేందుకు ముందుకొచ్చింది షురూక్..అదే మలీహా ప్రాంతంలో రాబోతున్న 'మూన్ రిట్రీట్'..

కాంస్య యుగం నాటి సమాధులు మరియు ఇస్లామిక్ రాచరపు కోటలకు నిలయం, యునెస్కో ప్రకటించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి షార్జాలోని మలీహా ప్రాంతంలో మార్చి చివరి నాటికి అతిథులను స్వాగతించడానికి 'మూన్ రిట్రీట్' సిద్ధంగా ఉన్నట్లు షార్జా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (షురూక్) ప్రకటించింది.

ఆకర్షణలు
ఈ గుడారాలలో వంట చేసుకునే సౌకర్యం, బాత్‌రూమ్‌లతో సహా రాత్రిపూట బస చేయడానికి మీకు కావలసిన అన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది. కొన్ని గుడారాలకు ప్రైవేట్ కొలనులు కూడా ఉన్నాయండోయ్..ఇక, బార్బెక్యూ/భోజన బుకింగ్ సదుపాయాలూ చలి మంటలకు ప్రత్యేక ఏర్పాట్లు, చుట్టుపక్కల కొండలలో స్టార్‌గేజింగ్ మరియు హైకింగ్ వంటి కార్యకలాపాలు ఈ క్యాంపింగ్ ప్రత్యేకతలు.

బుకింగ్లు
ఇక్కడ పది సింగిల్ బెడ్ డోములు, నాలుగు ఫ్యామిలీ గుడారాలు మరియు రెండు సింగిల్ బెడ్ గుడారాలు లభ్యమవుతాయి. మూన్ రిట్రీట్‌లోకి బుకింగ్ చేసే అతిథులు వీటిలో తమ అవసరానికి తగ్గ డోము/గుడారాన్ని ఎంచుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.shurooq.gov.ae ని సందర్శించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com