ఇండియా మీదుగా శ్రీలంక వెళ్లనున్న పాక్ ప్రధాని..ఓకే చెప్పిన భారత్
- February 23, 2021
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారత ఎయిర్‌లైన్స్ కీలక అనుమతులను మంజూరు చేసింది. ఇండియా మీదుగా శ్రీలంక వెళ్లేందుకు పాక్ ప్రధాని విమానానికి భారత పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది. భారత విమానాలకు పాక్ పలుమార్లు ఆంక్షలు విధించినప్పటికీ పాక్‌కు అడ్డు చెప్పకుండా కేంద్రం సానుకూలంగా స్పందించడం విశేషం. కోవిడ్ సంక్షోభం తర్వాత శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తున్న తొలి దేశాధినేత ఇమ్రాన్ ఖాన్. ఈ అధికారిక పర్యటనలో లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సే తో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు.
అయితే శ్రీలంక తమ పార్లమెంట్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగాన్ని రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. అలాగే పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నట్లు శ్రీలంక అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని మోదీ సౌది అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా తమ దేశం మీదుగా వెళ్లేందుకు పాక్ మోదీ విమానానికి అనుమతి నిరాకరించి కుటిలబుద్దిని చాటుకుంది. కానీ తాజాగా భారత్మాత్రం తన ఉదార స్వభావాన్నే చాటుకుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష