జగన్ కీలక నిర్ణయం

జగన్ కీలక నిర్ణయం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం, ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభంకానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌లో అభిప్రాయం పడినట్లు సమాచారం. హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాగే నవరత్నాలు అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ నేస్తం పథకానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

 

Back to Top