139 ఏళ్ల విక్టోరియా బంగళా వేరే అడ్రస్ కు తరలింపు
- February 23, 2021
అమెరికా:139 ఏళ్ల పాటు ఆ బంగళా చిరునామా అదే. కానీ, ఇప్పుడు మారిపోయింది. అలాగని ఆ ప్రాంతమేమీ మారలేదు. మారింది ఆ బంగళానే. ఓ చోటు నుంచి మరో చోటుకు తరలి వెళ్లింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్ స్ట్రీట్ లో విక్టోరియా హౌస్ అనే ఓ బంగళా ఉంది. మ్యాక్స్ ఇంగ్లాండర్ అనే ఓ వ్యక్తి అక్కడ 139 (1880లో) ఏళ్ల కిందట.. ఆరు బెడ్రూంలు, మూడు బాత్రూంలతో ఆ ఇంటిని నిర్మించుకున్నాడు. 1890లో అతడి మరణానంతరం అతడి కొడుకు ఆరోన్ కు ఆ ఇల్లు వారసత్వంగా వచ్చింది. 1920లో ఆరోన్ చనిపోయాక ఇల్లు పడావు పడిపోయింది. రిపేర్లకు వచ్చింది. ఇల్లు కట్టినదానికయ్యే ఖర్చు కన్నా.. ఆ రిపేర్లకే ఎక్కువవుతుండడంతో ఎవరూ దానిని కొనేందుకు ఆసక్తి చూపించలేదు. చివరకు 1990లో ఓ వ్యాపారి ఇంటిని కొన్నాడు. 2013లో దివాళా తీయడంతో అతడూ ఆ ఇంటిని వదిలేసుకున్నాడు.
అప్పటి నుంచి ఎన్నో చేతులు మారిన ఆ ఇంటిని.. ఇయాన్ బెర్కి అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి 26.5 లక్షల డాలర్లకు కొన్నాడు. అయితే, ఇంటి కన్నా ఆ ఇల్లున్న స్థలం చాలా విలువైనది కావడం, ఎక్కువ స్థలం ఉండడంతో అక్కడ ఓ అపార్ట్ మెంట్ కట్టాలనుకున్నాడు. కానీ, ఆ ఇంటిని కూల్చకుండానే ఆ పని చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఫ్రాంక్లిన్ స్ట్రీట్ నుంచి ఫుల్టన్ స్ట్రీట్ లోకి దానిని మార్చాడు. అందుకోసం హైడ్రాలిక్స్ సాయంతో ఆ బంగళాను పైకి లేపి.. ఓ పెద్ద ట్రక్కుపై పెట్టారు. నెమ్మదిగా దానిని తరలించారు. ఓ మార్చురీ పక్కన నిలబెట్టారు. బంగళా తరలింపు కోసం అడ్డొచ్చిన చెట్లన్నింటినీ నరికేశారు. ట్రాఫిక్ లైట్ల స్తంభాలను కూల్చేశారు. ఇంతకుముందు ఆ ఇల్లున్న స్థలంలో దాదాపు 47 యూనిట్లుండే ఓ పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ను కట్టనున్నాడు ఇయాన్.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!