‘ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్’ను ఉపయోగిస్తున్న జీఎంఆర్ ఎయిరో టెక్నిక్
- February 23, 2021
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూపు తాము ఆపరేట్ చేసే విమానాశ్రయాలలో అనేక నూతన ఆవిష్కరణలను అమలు చేస్తోంది.జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలలో ఈ-బోర్డింగ్, ఫేస్ రికగ్నిషన్, కాంటాక్ట్ లెస్ సెల్ప్ చెకిన్ కియోస్కులు లాంటి అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆ దిశలోనే, జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (GACAEL) యొక్క MRO (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) విభాగం జీఎంఆర్ ఏరో టెక్నిక్ (GAT), వినూత్న సాంప్రదాయిక హ్యాంగర్ నిర్మాణంతో పోలిస్తే ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ రూపంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా విమానాల నిర్వహణ, సేవాపరంగా ఆసియాలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. భారతదేశం మరియు ఆసియా ప్రాంతంలో అటువంటి హ్యాంగర్‌ను ఏర్పాటు చేసిన ఏకైక MRO జీఎంఆర్ ఏరో టెక్నిక్. ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్‌ను షెడ్యూల్డ్, అన్ షెడ్యూల్డ్ నిర్వహణ, ఇంజిన్ లేదా ల్యాండింగ్ గేర్ పున:స్థాపనతో సహా పలు కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు.
అన్‌షెడ్యూల్డ్ మరమ్మతులు చేపట్టడానికి అందుబాటులో ఉన్న హ్యాంగర్‌ను సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది. దీనికి విరుద్ధంగా, ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ తక్కు ఖర్చుతో కూడుకున్నది, సమయాన్ని తగ్గించేది. సాంప్రదాయిక హ్యాంగర్‌ను నిర్మించడంతో పోలిస్తే సమయం మరియు డబ్బు ఆదా చేస్తుంది. అదే సమయంలో సాంప్రదాయిక హ్యాంగర్ యొక్క అన్ని పనులు చేస్తూనే, భద్రతా లక్షణాలను కలిగి ఉంటూ, సాంప్రదాయ హ్యాంగర్ స్థిరత్వాన్ని ఇస్తుంది.
ఈ వన్-బే నారో బాడీ ఇన్‌ఫ్లేటబుల్ హాంగర్లో ఒక B737 లేదా A320 సిరీస్ విమానాన్ని ఉంచొచ్చు. ఇది ఇప్పటికే ఉన్న 7 బేల సామర్థ్యానికి అదనం. ఈ అదనపు లైన్‌తో, GATలో అదనంగా 15 నుండి 20 చిన్న బేస్ మెయింటెనెన్స్ చెక్‌లను లేదా సంవత్సరానికి 4 నుండి 5 లీజు చెక్కులను నిర్వహించవచ్చు.
 (1)_1614094025.jpg)
ఈ ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ జీవిత కాలం 10-15 సంవత్సరాలు. వివిధ పరిమాణాలలో లభించే ఈ ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ ఆర్డర్ ప్రకారం తయారు చేయబడింది. సాంప్రదాయిక హ్యాంగర్ నిర్మాణం 18 నెలల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుండగా, గాలితో కూడిన హ్యాంగర్‌ను 3-4 నెలల్లో నిర్మించవచ్చు. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీనిని విడదీయడానికి, తిరిగి నిర్మించడానికి కేవలం 1-2 నెలలు పడుతుంది. సాంప్రదాయిక హ్యాంగర్‌ను నిర్మించడంతో లేదా అద్దె/లీజులో ఇదే విధమైన సదుపాయాన్ని పొందడంతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన మరియు వేగవంతమైన మార్గం.
పీవీసీతో చేసిన ఈ పాలిస్టర్ బేస్ హ్యాంగర్ మంటలను మరియు నీటిని తట్టుకుంటుంది. ఆపరేటివ్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి హ్యాంగర్‌లో ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. హ్యాంగర్ పనితీరును రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏదైనా ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో పర్యవేక్షించేలా, ట్రాక్ చేసేలా ఎల్లప్పుడూ రియల్ టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుంది. హ్యాంగర్ ఫైర్ డిటెక్షన్, మంటలను ఆర్పే వ్యవస్థను కలిగి విలువైన ఆస్తులను కాపాడుతుంది. ఈ హ్యాంగర్ గంటకు 158.4 కిమీ వేగంతో వీచే గాలిని తట్టుకునేలా రూపొందించారు. ఇది -30 డిగ్రీల సెల్సియస్ నుండి +70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. ఖరీదైనవి, నిర్మించడానికి ఎక్కువ సమయం తీసుకునే సాంప్రదాయిక లోహపు హాంగర్‌లకు ఇది సరైన ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.
జీఎంఆర్ ఏరోటెక్నిక్ సిఇఒ అశోక్ గోపీనాథ్, “ఈ ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్‌ను వల్ల మా ఎంఆర్‌ఓకు అదనపు బిజినెస్ లభించి, విమానాల కార్యకలాపాలు మరియు డెలివరీకి సంబంధించి మేము వాటిని సరైన సమయంలో అందించగలుగుతాము. ఇటువంటి హ్యాంగర్‌లను ఐరోపాలోని ఎంఆర్‌ఓలు, జిసిసిలో సంప్రదాయ హ్యాంగర్‌లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. చాలా కాలంగా పెయింటింగ్, కొన్ని క్లిష్టమైన భాగాల వర్క్‌షాప్‌లు మరియు మిలిటరీ MRO వ్యాపారంతో సహా విస్తృత బాడీ ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యాన్ని పెంచడానికి మరికొన్ని హాంగర్‌లను జోడించాలని మేము చూస్తున్నాము. వ్యాపార అవసరాల కోసం కొత్త టెక్నాలజీలను నిరంతరం జత చేసుకోవడంలో GAT చాలా ముందుంటుంది.” అన్నారు.
హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరో టెక్నిక్‌లో ఉన్న సదుపాయానికి ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్ అదనపు డెడికేటెడ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మానవ వనరులు, టూలింగ్, సపోర్ట్ వర్క్‌షాప్ పరంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్లేటబుల్ హ్యాంగర్‌లో తలుపులు, లైటింగ్, ఫైర్ డిటెక్షన్ ఉంటాయి.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







