విద్యార్ధుల అడ్మిషన్ వయసును సవరించిన యూఏఈ
- February 24, 2021
యూఏఈ:స్కూల్స్ లో చేరే విద్యార్ధుల కనీస వయసును సవరిస్తూ యూఏఈ విద్యాశాఖ తీర్మానం చేసింది. ఐబీ, యూకే, అమెరికన్ బోధన విధానం అనుసరిస్తున్న స్కూల్స్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచే సవరణ వయసును అమలు చేయనుండగా..ఇండియా, పాకిస్తాన్ బోధన విధానం పాటిస్తున్న పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. విద్యార్ధులను అడ్మిషన్ చేయబోయే తరగతిని బట్టి ఫౌండేషన్ స్టేజ్ 1, ఫౌండేషన్ స్టేజ్ 2, ఇయర్ 1, ఇయర్ 2 విద్యార్ధుల వయసులో సవరణలు చేశారు. ఫౌండేషన్ స్టేజ్ 1 ప్రీ కేజీలో అడ్మిట్ అయ్యే విద్యార్ధుల వయసు ఆగస్ట్ 31, 2021 నాటికి మూడేళ్లు పూర్తి కావాలి. ఫౌండేషన్ స్టేజ్ 2(కేజీ1)లో అడ్మిట్ అయ్యే స్టూడెంట్స్ కి ఆగస్ట్ 31, 2021 నాటికి నాలుగేళ్లు నిండి ఉండాలి. కేజీ2(ఇయర్ 1) విద్యార్ధులకు ఐదేళ్లు, గ్రేడ్ 1(ఇయర్2) లో అడ్మిట్ అయ్యే విద్యార్ధుల వయసు వచ్చే ఆగస్ట్ 31 నాటికి ఆరేళ్లు పూర్తివ్వాలి. అయితే..గతంలో డిసెంబర్ 31కి పూర్తైన వయసును పరిగణలోకి తీసుకునే వారు. కానీ, యూఎస్, యూకే, ఐబీ బోధన విధానం పాటించే స్కూల్స్ లో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో ఆగస్ట్ 31ను డెడ్ లైన్ డేట్ గా మారుస్తూ యూఏఈ నిర్ణయం తీసుకుంది. ఇక భారత్, పాకిస్తాన్ బోధన విధనాన్ని పాటించే స్కూల్స్ ఏప్రిల్ లో ప్రారంభం అవుతాయి. దీంతో ఆయా స్కూల్స్ లో వయసు సవరణ తీర్మానాన్ని 2022-23 విద్యాసంవత్సరంలో అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







