బాలకృష్ణ కోసం కొత్త కథ రెడీ చేసిన గోపీచంద్
- February 24, 2021
హైదరాబాద్:ఈ ఏడాది మొదట్లోనే క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ తో కూడా అవకాశం లభించింది.అయితే వెంటనే బాలయ్యతో సినిమా చేసేందుకు గోపీచంద్ సిద్దమయ్యారు. ప్రస్తుతం గోపీ తను బాలయ్యతో చేయనున్న సినిమాకు కథను సిద్దం చేస్తున్నారు. అయితే వీరి కాంబో కోసం గోపీ అద్భుత ప్లాట్‌ను ఎంచుకున్నారంట. ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తారన్న వార్త హాట్ టాపిక్‌గా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథను గోపీ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బాలకృష్ణ చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ సినిమాలో చేయనున్నారు. ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగానే రెడీ చేయనున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష