ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకున్న 300 మందిని రక్షించిన DFWAC

- February 24, 2021 , by Maagulf
ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకున్న 300 మందిని రక్షించిన DFWAC

దుబాయ్:ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకొని దేశంగానీ దేశంలో యాతన అనుభవించే బాధితులకు భరోసా నిలబడుతోంది దుబాయ్ ఫౌండేషన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ (DFWAC). అక్రమ రవాణా, యజమానుల చేతులో చిత్రహింసలకు గురయ్యే బాధితులను రక్షించి వారికి తగిన న్యాయ సాయం అందిస్తూ కొత్త భవిష్యత్తును అందిస్తూ వస్తోంది. ఇటీవలె వేర్వేరు ఘటనల్లో దాదాపు 300 మందిని ట్రాఫికింగ్ చెర నుంచి రక్షించింది డిఎఫ్‌డబ్ల్యుఎసి. రీసెంట్ గా మరో 69 మంది బాధితులను కూడా రక్షించింది. రెస్క్యూ తర్వాత నివాస సదుపాయాలు, అహారం, దుస్తులు, ఆరోగ్యం, రవాణా ఇలా బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలను
చేపడుతున్నట్లు డిఎఫ్‌డబ్ల్యుఎసి డిప్యూటీ డైరెక్టర్ శిఖా అల్ మన్సౌరీ వెల్లడించారు. ఒత్తిడిలో ఉన్నా వారికి కౌన్సిలింగ్ ద్వారా ధైర్యాన్ని కలిగించి తిరిగి వారిని వారి కుటుంబ సభ్యులతో కలుపుతున్నామన్నారు.  బాధితులకు సాయం అందించటంలో దుబాయ్ హెల్త్ అథారిటీ, దుబాయ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ఆమె చెప్పారు. బాధితుల్లో కొందరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే..ఇంకొంరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారని వివరించారు.తీవ్రమైన ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి కావాల్సిన వైద్య సాయం కూడా అందిస్తున్నామని శిఖా అల్ మన్సౌరీ అన్నారు. అంతేకాదు..ట్రాఫికింగ్ ఉచ్చులో చిక్కుకొని సరైన డాక్యుమెంట్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి అవసరమైన న్యాయ సాయం అందిస్తున్నామని, అందుకోసం ఓ న్యాయ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు మన్సౌరీ వెల్లడించారు. డిఎఫ్‌డబ్ల్యుఎసి ఆర్గనైజేషన్ బాధితుల పక్షాన నిలబడేందుకు వారికి కావాల్సిన సాయం చేసేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా హెల్ప్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, బాధితులు 800111కి ఫోన్ చేసి హెల్ప్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చని..ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచటంతో పాటు వారికి భద్రతకు తాము భరోసా ఇస్తామని శిఖా అల్ అన్సౌరీ అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com