బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత

- February 25, 2021 , by Maagulf
బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు అప్లికేషన్స్‌పై ఉన్న నిషేధం ఎత్తివేశారు. ట్రంప్‌ విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వేలాది భారతీయులతో పాటు గ్రీన్ కార్డ్ ఆశించే విదేశీయులకు కొత్త అవకాశాలు రానున్నాయి. అమెరికాలో నివసిస్తోన్న ప్రతీ భారతీయుడి అతి పెద్ద డ్రీమ్‌ గ్రీన్‌ కార్డు.

అమెరికాలో పౌరసత్వం అందించే ఈ గ్రీన్‌కార్డు కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అమెరికాలో నివసిస్తూ గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తోన్న వారికి బైడెన్‌ శుభవార్త చెప్పారు. బైడెన్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. కరోనా సాకుతో గతేడాది ఏప్రిల్‌లో గ్రీన్ కార్డు ఆప్లికేషన్లను ట్రంప్‌ బ్యాన్‌ చేశారు. డిసెంబరు 31, 2020తో వరకు ఉన్న నిషేధాన్ని తర్వాత ట్రంప్‌ మార్చి 31వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం, యూఎస్ ఉద్యోగులను రక్షించడం కోసం ఇది అవసరమైన చర్య అని ట్రంప్ చెప్పారు.

దీంతో అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డు కోసం ఎదరురుచూసే వారి ఆశలపై ట్రంప్‌ నీళ్లు చల్లారు. ఈ నిర్ణయంపై అప్పట్లో బైడెన్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు ఆప్లికేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని హామి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com