యూఏఈ వీకెండ్ వెదర్: ఆకాశం మేఘావృతం

యూఏఈ వీకెండ్ వెదర్: ఆకాశం మేఘావృతం

యూఏఈ:వారాంతంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొని వుంది యూఏఈలో. పలు చోట్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది. తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండే అవకాశముంది. సముద్రం ఓ మోస్తరు నుంచి రఫ్‌గా వుండనుంది. తూర్పు ప్రాంతాల్లో మిస్ట్ ఫార్మేషన్ కనిపిస్తుంది. శనివారం కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. ఆదివారం ఉదయం హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ వుండొచ్చు.

Back to Top