డాక్టర్‌పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ

డాక్టర్‌పై దాడి గర్హనీయం: హెల్త్ మినిస్ట్రీ

కువైట్ సిటీ :అల్ రజి హాస్పిటల్‌లో విధి నిర్వహణలో వున్న ఓ వైద్యుడిపై జరిగిన దాడిని హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలు హేయమని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కాగా, షువైక్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. ఓ వ్యక్తి, డాక్టరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో వైద్యుడి చెయ్యి విరిగినట్లుగా తెలుస్తోంది. కరోనాతో బాధపడుతున్న తన బంధువుని పరామర్శించేందుకు నిందితుడు ఆసుపత్రికి రాగా అతన్ని వైద్యుడు నిలువరించడమే ఈ ఘటనకు కారణం. మరోపక్క, వైద్యుల రక్షణ కోసం అన్ని చర్యలూ చేపడుతున్నామనీ, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని అథారిటీస్ పేర్కొన్నాయి.

Back to Top