‘గాలి సంపత్’ ట్రైలర్ విడుదల
- February 27, 2021హైదరాబాద్:యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ‘గాలి సంపత్’. శ్రీ విష్ణు సరసన లవ్లీ సింగ్ కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషించారు. అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటన ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అలరిస్తుంది. మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్