ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్ టీకా ధర రూ.250

- February 27, 2021 , by Maagulf
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్ టీకా ధర రూ.250

న్యూ ఢిల్లీ:కోవిడ్-19 వైరస్‌కు చెక్ పెట్టేందుకు భారత్‌లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.. అయితే, మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.. రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే కోవిడ్‌ టీకాలు వేయనుండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే టీకా ధర ఎంత ఉంటుంది? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఒక్కడోసుకు 250 రూపాయల వరకు వసూలు చేయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది... ప్రైవేట్ ఆస్పత్రులో తీసుకునే టీకా ధర రూ. 250గా నిర్ణయించగా.. దీనికి అదనంగా రూ .100 సర్వీస్ ఛార్జీ ఉంటుందని చెబుతున్నారు. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆయుష్మాన్ భారత్-పిఎంజెఎ పరిధిలో సుమారు 10,000 ఆస్పత్రులు మరియు సిజిహెచ్ఎస్ పరిధిలోని 687 ఆసుపత్రులను సివిసిలుగా రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు, అన్ని పిఎస్‌యుల ఆరోగ్య సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలను సివిసిలుగా ఉపయోగించుకునే వీలుతో పాటు.. ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్రం.. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య దేశంలో 1.37 కోట్లు దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా.. 42 రోజుల పాటు.. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 2,84,297 టీకాలను ఇచ్చారు.. అందులో 1,13,208 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోస్ వేయగా, 1,71,089 హెచ్‌సిడబ్ల్యులకు రెండో డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com