కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు

- February 27, 2021 , by Maagulf
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు

కువైట్ సిటీ:భద్రత ప్రమాణాలను మెరుగుపర్చటంలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన కెమెరాలను అమరుస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో పాత కెమెరాలను తొలగించి.. మొత్తం 870 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉన్నాయని పేర్కొంది. ఎయిర్ పోర్టులోని అన్ని విభాగాలు, భవనాలతో పాటు టెర్మినల్ 4, టెర్మినల్ 5 బిల్డింగ్ లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు వివరించారు. అలాగే కెమెరా ఫూటేజ్ ను విశ్లేషించేందుకు 20 టీవీ స్క్రీన్లు, 4 బై 2 మీటర్ల వీడియో వాల్ తో అధునాతన కంట్రోల్ రూం సిద్ధమవుతోందన్నారు. ప్రస్తుతం అమరుస్తున్న అధునాతన కెమెరాలు విమానాశ్రయానికి వచ్చే వారి ఫేస్ ను రీడ్ చేసి వారి వివరాలను కంట్రోల్ రూంకి చేరవేస్తాయని..అలాగే పార్కింగ్ ఏరియాలోని కెమెరాలు వాహనాల నెంబర్ ఫ్లేట్లను రీడ్ చేస్తాయని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com