Bengal Assembly Elections 2021: బీజేపీలో చేరనున్న గంగూలీ?
- February 28, 2021
కేంద్ర ఎన్నికల సంఘం... ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించగానే... కీలకమైన పశ్చిమ బెంగాల్, మిగతా మూడు రాష్ట్రాలు... కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రకరకాల రూమర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్ దాదా సౌరబ్ గంగూలీ రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్... బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) అధ్యక్షుడు అయ్యాడో... అప్పటి నుంచే ఈయన బీజేపీలోకి వెళ్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఇప్పుడు ఎన్నికల హడావుడి నడుస్తోంది కాబట్టి... తనను బీసీసీఐ అధ్యక్షుణ్ని చేసినందుకు రుణం తీర్చుకునేలా గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే లెక్కలు వేస్తున్నారు విశ్లేషకులు. బుధవారం... గుజరాత్... అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద మోతేరా క్రికెట్ స్టేడియంను ప్రారంభించినప్పుడు దాదా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







