అమితాబ్ కు మళ్ళీ ఆపరేషన్
- February 28, 2021బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగులో వివరిస్తూ.. కొద్ది రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. బిగ్‌బీకి సర్జరీ అనేసరికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్‌కు ఏమైంది.. అసలు సర్జరీ ఎందుకు? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అలాగే బిగ్‌బీ చేయించుకోబోయే శస్త్ర చికిత్స విజయవంతం కావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలు చేయాలని ఆశిస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కాగా, గతంలో కూడా బిగ్‌బీకి అనేకసార్లు సర్జరీ జరిగింది. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నారు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. అబితాబ్ తాజాగా నటించిన చిత్రాలలో ‘ఝుండ్’ జూన్ 18న ‘చెహరే’ ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత