వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఐసోలేషన్ అవసరంలేదు

- March 01, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఐసోలేషన్ అవసరంలేదు

రియాద్:కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఐసోలేషన్ అవసరం లేదని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది.ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్లను సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ ఆమోదించిన సంగతి తెల్సిందే.కరోనా వైరస్‌పై పోరు కోసం ఈ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు. ఒకసారి కరోనా సోకిన తర్వాత 90 రోజుల లోపు తిరిగి కరోనా బారిన పడటం అనేది చాలా అరుదైన విషయమని మినిస్ట్రీ పేర్కొంది.అలాంటివారు ఆరు నెలలపాటు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని మినిస్ట్రీ వెల్లడించింది.ఒక వ్యాక్సిన్ డోసుతో కరోనాకి దూరంగా వుండడం సాధ్యం కాకపోవచ్చనీ, రెండు వ్యాక్సిన్లతోనే పూర్తి రక్షణ లభిస్తుందని అథారిటీస్ వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com