వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనుకాడవద్దు- టి.గవర్నర్‌

వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనుకాడవద్దు- టి.గవర్నర్‌

పుదుచ్చేరి:కరోనా‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు వెనుకాడవద్దని తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.దేశ వ్యాప్తంగామూడోదశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపధ్యంలో సోమవారం పాండిచ్చేరి నుంచి తెలంగాణ పరిస్థితులపై ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైన 60సంవత్సరాలు పై బడిన వారు, వివిధ రకాల రుగ్మతలను కలిగి ఉన్న 45 సంవత్సరాలుపై బడిన వారు తప్పని సరిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. 

రాజ్‌భవన్‌లోనూ అర్హులైన వారిని గుర్తించి వారు త్వరగా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు రాజ్‌భవన్‌ అధికారులు కృషి చేయాలని సూచించారు.రాజ్‌భవన్‌లో అర్భులైన వారు వ్యాక్సిన్‌ తీసుకుని ఇతరులకు రోల్‌మోడల్‌గా నిలవాలని అన్నారు.సాధారణ ప్రజలు కూడా కోవిడ్‌ వ్యాప్తిచెందకుండా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని గవర్నర్‌ సూచించారు.ప్రజల్లో వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియా కూడా తమ వంతు కృషి చేయాలని అన్నారు.

Back to Top