ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోని మంత్రి ఈటల

ఏడాదిగా ఒక్క సెలవు కూడా తీసుకోని మంత్రి ఈటల

హైదరాబాద్:కరోనా రాష్ట్రంలోకి ప్రవేశించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రేపు ఉదయం 8 గంటలకు గాంధీ ఆసుపత్రి సందర్శించనున్నారు. 

సవాళ్లను ఎదుర్కోవడంలో సహజ గుణం కలిగిన తెలంగాణ సమాజం కరోనా వైరస్ ను సమర్థంగా ఎదుర్కొంది. కరోనా రక్కసి ఒక పక్కన ప్రపంచంలో మరణమృదంగం మోగించినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక చర్యల వల్ల నామమాత్రపు హానితోనే బయటపడింది.ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం కూడా తోడు కావడంతో కరోనా పై పోరాటం కూడా ఉద్యమ స్థాయిలో నడిచి జనజీవనం ఏడాది తిరగకుండానే సాధారణ స్థాయికి చేరుకుంది. కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య విపత్తు సంభవించినా ఎదుర్కొనే సామర్థ్యం ను, నైపుణ్యాన్ని,  అనుభవాన్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకొగలిగింది.  

సొంత వారు కూడా దగ్గరికి రాని సమయంలో ప్రేమ, ఆప్యాయతలతో ధైర్యంగా చికిత్స అందించిన డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, హెల్త్ వర్కర్స్ కి,పారిశుద్ధ్య కార్మికులకు,  పోలీసులకు కరోనా మహమ్మారి పై పోరాటం ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు.ఎప్పటికప్పుడు ప్రజలకు కరొనాపై సమాచారం అందించి భయాన్ని పోగొట్టి, ప్రజలకు జాగ్రత్తలు చెప్పిన   మీడియా, పత్రికల ప్రతినిధులు, యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.కరోనా  వ్యాక్సిన్నే ఈ మహమ్మారిని పారద్రోలడానికి శాశ్వత పరిష్కారం. వాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం.భయాందోళనలు లేకుండా ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ప్రభుత్వం సూచించిన సలహాలు సూచనలు పాటించండి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

Back to Top