కోవిడ్ ఎఫెక్ట్: భారత రాయబార కార్యాలయం మూసివేత
- March 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు రాయబార కార్యాలయంలో ప్రత్యక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలాఉంటే మార్చి నెలకు సంబంధించి ఎంబసీ కార్యాలయం షెడ్యూల్ చేసిన అన్ని ఈవెంట్లను వాయిదా వేశామని కూడా అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







