ఏపీలో పెట్టుబడులు పెట్టండి, మారిటైం సమ్మిట్ లో సీఎం జగన్ పిలుపు
- March 02, 2021
అమరావతి:మారిటైమ్ ఇండియా సమ్మిట్ –2021’ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.
క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న సీఎం వైయస్.జగన్.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నంబర్ 1 గా ఉండడాన్ని గర్విస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ చెప్పారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సపోర్ట్ ఎకో సిస్టమ్, పోర్ట్ అధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.ఇవాళ అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన వర్చువల్ గా మారిటైం ఇండియా సమ్మిట్ 2021 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీలో ఒక మేజర్ పోర్ట్ విశాఖపట్నంలో, 5 రాష్ట్ర పోర్టులు, 10 నోటిఫైడ్ పోర్ట్ లు ఉన్నాయని సీఎం చెప్పారు. ఏపీకి 170 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యం ఉందని సీఎం ఈ సందర్బంగా చెప్పారు. జాతీయ ఎగుమతుల్లో ఏపీ వాటా 4 శాతమని, ఆ మొత్తాన్ని 2030 నాటికి 10 శాతానికి పెంచాలని సంకల్పంతో ఉన్నామని జగన్ అన్నారు.

పోర్ట్ లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ఈ నేపథ్యం లో మరో మూడు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భవనపాడులో పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని, 2023 నుండి ఆ పోర్టులు కార్యకలాపాలు ప్రారంభిస్తాయని స్పష్టం చేశారు. దీనితో మరో 100 మిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ పెరుగుతుందన్నారు. కేంద్ర సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి సాగుతుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ, విదేశాలనుంచి భారీ ఎత్తున పెట్టుబడిదారులు ఈ సమ్మిట్ లో పాల్గొనాలని, ఏపీలో పెట్టుబడులు పెట్లాలని కూడా ఈ సందర్భంగా సీఎం పిలుపునిచ్చారు.

తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







