మార్చి 26న విడుదల కానున్న 'సైనా' బయోపిక్
- March 02, 2021
హైదరాబాద్:ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైన నెహ్వాల్ బయోపిక్ ఈ నెల 26న విడుదల కానుంది. ఓ సాధారణ యువతి ఒలంపిక్ మెడల్ ఎలా సాధించిందనే అంశంతో ఈ బయోపిక్ తెరకెక్కింది. పరిణితీ చోప్రా సైనా పాత్రలో నటించింది. టీ సీరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అమోల్ గుప్తే. 'సైనా' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. ప్రీ లుక్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు దర్శకనిర్మాతలు. సైనా నిజజీవితంలో జరిగిన సంఘటనలో తెరకెక్కిన ఈ సినిమా కోసం పరిణితీ చోప్రా కఠోర సాధన చేసింది. బయోపిక్ లకు ఆదరణ లభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో సైనా నెహ్వాల్ బయోపిక్ 'సైనా' కూడా ప్రేక్షకాదరణ పొందుతుందేమో చూద్దాం.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







