హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు
- March 02, 2021
రియాద్:హౌతీ మిలీషియా జరిపిన దాడిలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలోని జజాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ (జజాన్ ప్రాంతం) ప్రతినిథి కల్నల్ ముహమ్మద్ అల్ గామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గరు సౌదీ పౌరులు, ఇద్దరు యెమనీలు ఈ దాడిలో ఘాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు ఇళ్ళు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఓ గ్రాసరీ స్టోర్ కూడా ధ్వంసమైంది. అరబ్ సంకీర్ణదళం హౌతీ తీవ్రవాదులతో నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసింది. యెమెన్‌లో శాంతి కోసం సంకీర్ణ దళం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







