అల్యూమినియం క్యాన్స్ కలెక్షన్ డే
- February 27, 2016
ఎమిరేట్ ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ నిర్వహించిన 'క్యాన్ కలెక్షన్ డే' సక్సెస్‌ఫుల్‌గా 4,500 కిలోల అల్యూమినియమ్ క్యాన్లను సేకరించింది. ఈ ఏడాది చివరినాటికి 27,000 కిలోల క్యాన్లను కలెక్ట్ చెయ్యాలన్నది లక్ష్యంగా పెట్టుకుని యూఏఈ వ్యాప్తంగా 'ఈఈజీ' ఉద్యమం చేపట్టింది. ఈ 'క్యాన్ కలెక్షన్ డే'లో 210 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హోటళ్ళు, ఎకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే కాకుండా సామాన్యులూ పాల్గొని క్యాన్లను సేకరించారు. ఎమిరేట్ ఫ్లైట్ కేటరింగ్ ఈ కలెక్షన్ డ్రైవ్‌కి పెద్ద కంట్రిబ్యూటర్ అని 'ఈఈజీ' చైర్ పర్సన్ హబీబా అల్ మరాషి చెప్పారు. సుమారు 1000 కిలోల బరువైన క్యాన్లను ఆ సంస్థ సేకరించారని ఆమె వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 5,543 కిలోల అల్యూమినియం క్యాన్లను సేకరించింది 'ఈఈజీ'. 19 ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా 256,753 కిలోల క్యాన్లను సేకరించడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందనీ, అల్యూమినియం క్యాన్లను రీసైకిలింగ్ చేయవచ్చని, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







