జెట్ స్కీస్‌పై బ్యాన్ ఉన్నా లెక్కలేదు
- February 27, 2016
జెట్ స్కీస్‌పై బ్యాన్ ఉన్నా ఆపరేటర్లు ఆ బ్యాన్‌ని లెక్క చేయడంలేదు. అల్ బతీన్ బీచ్ మరియు అల్ మక్తా మధ్యనున్న రెండు బ్రిడ్జిల మధ్య బ్యాన్ చేశారు. అలాగే అల్ రహా బీచ్ ఏరియా, అల్ మక్తా, అబుదాబీ కోర్నిచె, అల్ బతీనా ఏరియా మరియు సాదియాత్ ఐలాండ్లలో ఈ బ్యాన్ కొనసాగుతోంది. బ్యాన్ ఉన్నా ఔత్సాహికులు జెట్ స్కీయింగ్‌పై ఆసక్తి చూపుతుండడంతో ఆపరేటర్లు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. ఫైన్ కట్టి, తిరిగి తాము యధాతథంగా జెట్ స్కీ కొనసాగిస్తున్నామని కొందరు చెప్పారు. జెట్ స్కీ విషయంలో తాము రైడర్స్‌కి లైఫ్ జాకెట్ అందిస్తామనీ, ఒకవేళ కింద పడిపోయినా, నీటిలో మునిగిపోయే అవకాశం ఉండదని ఓ ఆపరేటర్ వెల్లడించారు. 18 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్నవారికి స్కీయింగ్ పూర్తిగా నిషేధం. అయితే తమ పిల్లలకు పెద్దలే తమ సొంత ఐడిలతో జెట్ స్కీ ఇస్తున్నారనీ, అలాంటి సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆపరేటర్లు చెప్పారు. అయితే జెట్ స్కీ విషయంలో ఏమాత్రం నిబంధనల ఉల్లంఘన జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







