కువైట్:ప్రైవేట్ బీచుల్లో స్విమ్మింగ్ అనుమతులపై పరిశీలన
- March 03, 2021
కువైట్ సిటీ:కువైట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ బీచులలో ఈతకు అనుమతి తెలిపే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ బీచుల్లో స్విమ్మింగ్ పర్మిషన్ కు సంబంధించి తాము యోచిస్తున్నట్లు మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మన్ఫుహి తెలిపారు. అయితే..ప్రైవేట్ ఇళ్ల నిర్మాణం అనుమతి అంశాన్ని మాత్రం ఆయన తిరస్కరించారు. ప్రైవేట్ ప్రాంతాల్లో హౌసింగ్ ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చే ఉద్దేశ్యం తమకు లేదని అల్ మన్ఫుహి స్పష్టం చేశారు. హౌసింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వటం ద్వారా జనాభా పెరుగుదల ఉంటుందని, దీంతో విద్యుత్, నీటి సేవలపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్









