కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం చేసిన దుబాయ్..అర్హత వయసులో సడలింపులు

- March 03, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం చేసిన దుబాయ్..అర్హత వయసులో సడలింపులు

దుబాయ్:కోవిడ్ వ్యాక్సినేషన్ను దుబాయ్ హెల్త్ అథారిటీ మరింత ముమ్మరం చేసింది. ప్రధాన మంత్రి, దుబాయ్ రూలర్, డీహెచ్ఏ వైస్ ప్రెసిడెంట్షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ అర్హత వయసులో సడలింపులు ఇచ్చింది. ఇక నుంచి 40 ఏళ్లపైబడిన వారు కూడా వ్యాక్సిన్ కోసం తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని డీహెచ్ఏ స్పష్టం చేసింది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేవారికి ఖచ్చితంగా దుబాయ్ రెసిడెన్సీ వీసాదారులు అయి ఉండాలి. అలాగే 60 ఏళ్లకుపైబడి..ఏ ఎమిరేట్స్ లోనైనా రెసిడెన్సీ వీసా ఉంటే టీకా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అయితే..వారు ప్రస్తుతం దుబాయ్ లోనే నివసిస్తున్నట్లు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇక ఎమిరాతి ఐడీ కార్డుదారులు ఉన్న జీసీసీ దేశాల పౌరులు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేలా కనీస, గరిష్ట వయసు నిబంధనల్లోనూ సడలింపులు చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కనీస అర్హత వయసును 18 ఏళ్లుగా నిర్దేశించిగా...ఇప్పుడు ఆ వయసును 16 ఏళ్లకు తగ్గించింది. అలాగే భారత ఉత్పత్తి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకా వినియోగానికి 18-65 వయసును ప్రమాణికంగా నిర్ణయించగా..ప్రస్తుతం ఆ అర్హత వయసును సవరిస్తూ 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ అస్ట్రాజెనెకా ఇవ్వొచ్చని సూచించింది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు యధావిధిగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవాలని స్వచ్ఛదంగా ముందుకు వచ్చే వారు డీహెచ్ఏ యాప్ ద్వారాగానీ డీహెచ్ఏ వెబ్ సైట్ ద్వారాగానీ తమ పేర్లను నమోదు చేసుకోవాలి. లేదంటే 800 342 కి కాల్ చేసి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని డీహెచ్ఏ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com