జెట్‌ స్కీస్‌పై బ్యాన్‌ ఉన్నా లెక్కలేదు

- February 27, 2016 , by Maagulf
జెట్‌ స్కీస్‌పై బ్యాన్‌ ఉన్నా లెక్కలేదు



జెట్‌ స్కీస్‌పై బ్యాన్‌ ఉన్నా ఆపరేటర్లు ఆ బ్యాన్‌ని లెక్క చేయడంలేదు. అల్‌ బతీన్‌ బీచ్‌ మరియు అల్‌ మక్తా మధ్యనున్న రెండు బ్రిడ్జిల మధ్య బ్యాన్‌ చేశారు. అలాగే అల్‌ రహా బీచ్‌ ఏరియా, అల్‌ మక్తా, అబుదాబీ కోర్నిచె, అల్‌ బతీనా ఏరియా మరియు సాదియాత్‌ ఐలాండ్‌లలో ఈ బ్యాన్‌ కొనసాగుతోంది. బ్యాన్‌ ఉన్నా ఔత్సాహికులు జెట్‌ స్కీయింగ్‌పై ఆసక్తి చూపుతుండడంతో ఆపరేటర్లు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. ఫైన్‌ కట్టి, తిరిగి తాము యధాతథంగా జెట్‌ స్కీ కొనసాగిస్తున్నామని కొందరు చెప్పారు. జెట్‌ స్కీ విషయంలో తాము రైడర్స్‌కి లైఫ్‌ జాకెట్‌ అందిస్తామనీ, ఒకవేళ కింద పడిపోయినా, నీటిలో మునిగిపోయే అవకాశం ఉండదని ఓ ఆపరేటర్‌ వెల్లడించారు. 18 ఏళ్ళ కన్నా తక్కువ వయసున్నవారికి స్కీయింగ్‌ పూర్తిగా నిషేధం. అయితే తమ పిల్లలకు పెద్దలే తమ సొంత ఐడిలతో జెట్‌ స్కీ ఇస్తున్నారనీ, అలాంటి సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆపరేటర్లు చెప్పారు. అయితే జెట్‌ స్కీ విషయంలో ఏమాత్రం నిబంధనల ఉల్లంఘన జరిగినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com