ఇల్లీగల్ గ్యాదరింగ్స్, గ్యాంబర్లకు పోలీసుల వార్నింగ్

- March 04, 2021 , by Maagulf
ఇల్లీగల్ గ్యాదరింగ్స్, గ్యాంబర్లకు పోలీసుల వార్నింగ్

షార్జా:కింగ్డమ్ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని షార్జా పోలీసులు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా భౌతిక దూరం పాటించకుండా గుమికూడే ఏ చర్యల్ని సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.ముఖ్యంగా కుర్రాళ్లు ఆరోగ్య శాఖ సూచనలను పాటించటంలో అలక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ సెల్లార్ ప్రాంతాల్లో ఒకే చోట గుమికూడటం వంటి ఇల్లీగల్ గ్యాదరింగ్స్ తో పాటు ఆటల పేరుతో గ్రీన్ స్కౌర్స్ లో ఒకే చోటుకు చేరటం కూడా నేరమేనని స్పష్టత ఇచ్చారు. అలాగే బిచ్చగాళ్లు, గ్యాంబర్లను అరికట్టేందుకు సంకోచించే ప్రసక్తే లేదన్నారు. క్రికెట్ ఆడుతున్న 13 మంది కుర్రాళ్లకు ఫైన్ విధించిన మరుసటి రోజే పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఏ అలక్ష్యాన్ని, ఉల్లంఘనలను ఉపేక్షించబోమని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com