కువైట్లో పాక్షిక కర్ఫ్యూ..విదేశీయులకు నో ఎంట్రీ

- March 05, 2021 , by Maagulf
కువైట్లో పాక్షిక కర్ఫ్యూ..విదేశీయులకు నో ఎంట్రీ

కువైట్ సిటీ:కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పుపై ఆందోళన చెందుతున్న కువైట్..వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మళ్లీ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. కోవిడ్ తీవ్రతపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 12 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. మార్చి 7(ఆదివారం) నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమలవుతాయని ప్రకటించింది. అయితే..కర్ఫ్యూ సమయంలో డెలివరీ సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. రెస్టారెంట్లు, ఫార్మసిస్ ఇతర వ్యాపారులు తమకు వచ్చిన ఆర్డర్లను హోమ్ డెలివరీ ద్వారా అందించొచ్చని స్పష్టం చేసింది. ఏసీ, లిఫ్ట్ మెయిన్టనెన్స్ సిబ్బందికి కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే కర్ఫ్యూ సమయంలో ఇంటి దగ్గరే ఉన్న మసీదుల్లో ప్రార్థనకు వెళ్లొచ్చని, అయితే వాహనాల్లో వెళ్లేందుకు మాత్రం అనుమతి లేదని వెల్లడించింది. ఇక టాక్సీలలో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణం చేయటంపై నిషేధం విధించింది. పబ్లిక్ పార్కులు అన్నింటిని మూసివేస్తున్నటు ప్రకటించింది. ఇదిలాఉంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులపై ట్రావెల్ బ్యాన్ కొనసాగుతుందని, కేవలం కువైట్ పౌరులకు మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com