జీవితంలో ముఖ్య ఘటనలపై షేక్ మొహమ్మద్ వీడియో

- March 06, 2021 , by Maagulf
జీవితంలో ముఖ్య ఘటనలపై షేక్ మొహమ్మద్ వీడియో

దుబాయ్:యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన జీవితానుభవాలకు సంబంధించి ఈ వీడియో ఆయన పొందుపరిచారు. 'రేస్ టు ఎక్సలెన్స్‌లో పినిషింగ్ లైన్' అనేది వుండదని ఆయన ఈ వీడియోలో తన బృందానికి తెలిపారు.దుబాయ్ మీడియా కార్యాలయం ఈ వీడియోను ట్వీట్ చేసింది.అందరికీ డ్రీమ్స్ వుంటాయి.. కానీ, ఒక లీడర్ మాత్రమే ఆ కలల్ని నిజం చేయగలుగుతాడు.. అని కూడా వీడియోలో పేర్కొన్నారు షేక్ మొహమ్మద్. రిస్క్ తీసుకోకపోవడమే జీవితంలో అతి పెద్ద రిస్క్ అని కూడా ఆయన వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com