ఆధార్ PVC కార్డు

- March 06, 2021 , by Maagulf
ఆధార్ PVC కార్డు

ప్రస్తుతం భారత దేశంలో ఏ పనిచేయాలన్నా ఆధార్‌ కార్డు తప్పనిసరిగా మారింది.గుర్తింపు కార్డు అవసరమైన ప్రతీ చోటా ఆధార్‌ కార్డును అడుగుతున్నారు. ప్రతీ చోటుకు ఆధార్‌ను క్యారీ చేయలేని వారి కోసం స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించని వారి పరిస్థితి ఏంటి. వారు కార్డును తప్పనిసరిగా తీసుకేళ్లాల్సిందే. అయితే మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న కార్డు కాస్త పెద్ద సైజ్‌లో ఉండడంతో క్యారీ చేయడం ఇబ్బందిగా మారుతోంది. ఆధార్‌ కార్డు ఓ చిన్న ఏటీఎమ్‌ కార్డు సైజ్‌లో ఉంటే ఎంచక్కా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లొచ్చు..

అచ్చంగా ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చింది యూఐడీఏఐ. ఇందులో భాగంగానే ఏటీఎమ్‌ కార్డు సైజులో ఉండే ఆధార్‌ కార్డు కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం పాలి వినైల్‌ క్లోరైడ్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుపై క్యూర్‌ కోడ్‌, హోలోగ్రామ్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న పది రోజుల్లోనే కొత్త కార్డు మీ ఇంటికి వస్తుంది. ఇందుకోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా అప్లయ్‌ చేసుకోవాలంటే..

  • ఈ కొత్త రకం కార్డుకోసం అప్లయ్‌ చేసుకోవాలనుకునే వారు ముందుగా.. యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in/లోకి వెళ్లాలి.
  •  అనంతరం ‘గెట్‌ ఆధార్‌’ అప్షన్‌ కింద ‘ఆర్డర్‌ ఆధార్‌ పీవీసీ కార్డ్‌’పై క్లిక్‌ చేయాలి.
  •  తర్వాత ఓపెన్‌ అయిన కొత్త విండోలో ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  •  అనంతరం వచ్చిన ‘క్యాప్చా’ కోడ్‌ను ఎంటర్‌ చేసి ‘సెండ్ ఓటీటీ’పై క్లిక్‌ చేయాలి.
  •  మీ ఫోన్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై నొక్కాలి.
  • దీంతో మీ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. వివరాలను సరిచూసుకున్న తర్వాత ‘మేక్‌ పేమెంట్‌’పై క్లిక్‌ చేసి డబ్బులు చెల్లిస్తే పది రోజుల్లో కొత్త ఆధార్‌ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది.
  • ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించేందుకు యూపీఐ సహా అన్ని రకాల పేమెంట్స్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com