ఇద్దరు పంజాబ్ ఎంపీలను కలిసిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు
- March 07, 2021
న్యూ ఢిల్లీ:న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో రైతుల మద్దతు శిబిరం వద్ద తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం ఆదివారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలను కలిసి గల్ఫ్ కార్మికుల వేతన సమస్యల గురించి వినతిపత్రాలు సమర్పించారు.
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ లుథియానా ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు, అమృతసర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజా లకు గల్ఫ్ జెఏసి ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించిన అనంతరం అక్కడి శిబిరంలో కూర్చుండి చర్చించారు. 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడము వలన కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని గల్ఫ్ జెఏసి ప్రతినిధులు స్వదేశ్ పరికిపండ్ల, గుగ్గిల్ల రవిగౌడ్, తోట ధర్మేందర్ ఎంపీలకు వివరించారు.
వేతన తగ్గింపు వలన గల్ఫ్ దేశాలలోని 88 లక్షల మంది భారతీయ కార్మికులకు రాబోయే కాలంలో ఆర్థికంగా నష్టం జరుగుతుందని, ప్రధానమైన ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని, విదేశాంగ మంత్రిని కలుస్తామని ఎంపీలు ఈ సందర్భముగా చెప్పారు.
గల్ఫ్ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎంపీలకు గల్ఫ్ జెఏసి ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. బృంద సభ్యులు అనిల్, రంజిత్, రాజశేఖర్, వినయ్, మల్లిఖార్జున్, ప్రశాంత్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష