న్యూ ఢిల్లీలో ఏ.పీ,కేరళ ఎంపీలను కలిసిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు

- March 08, 2021 , by Maagulf
న్యూ ఢిల్లీలో ఏ.పీ,కేరళ ఎంపీలను కలిసిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు

న్యూ ఢిల్లీ:న్యూ ఢిల్లీలోని పార్లమెంటు సభ్యుల నివాసాల వద్ద తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం సోమవారం ఏ.పీ,కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీలను కలిసి గల్ఫ్ కార్మికుల వేతన సమస్యల గురించి వినతిపత్రాలు సమర్పించారు. 

గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ AP ఎంపీ టీ.జి వెంకటేశ్, కేరళ రాజ్యసభ సభ్యులు సోమ ప్రసాద్ లకు గల్ఫ్ జెఏసి ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించి చర్చించారు. 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడం తగదని గల్ఫ్ జెఏసి కన్వీనర్,గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల తోట ధర్మేందర్ వినయ్  ఎంపీలకు వివరించారు. 

వేతన తగ్గింపు వలన గల్ఫ్ దేశాలలోని 88 లక్షల మంది భారతీయ కార్మికులకు రాబోయే కాలంలో ఆర్థికంగా నష్టం జరుగుతుందని, ప్రధానమైన ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని, విదేశాంగ మంత్రిని  కలుస్తామని ఎంపీలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com