న్యూ ఢిల్లీలో ఏ.పీ,కేరళ ఎంపీలను కలిసిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు
- March 08, 2021
న్యూ ఢిల్లీ:న్యూ ఢిల్లీలోని పార్లమెంటు సభ్యుల నివాసాల వద్ద తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం సోమవారం ఏ.పీ,కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీలను కలిసి గల్ఫ్ కార్మికుల వేతన సమస్యల గురించి వినతిపత్రాలు సమర్పించారు.
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ AP ఎంపీ టీ.జి వెంకటేశ్, కేరళ రాజ్యసభ సభ్యులు సోమ ప్రసాద్ లకు గల్ఫ్ జెఏసి ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించి చర్చించారు. 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడం తగదని గల్ఫ్ జెఏసి కన్వీనర్,గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల తోట ధర్మేందర్ వినయ్ ఎంపీలకు వివరించారు.
వేతన తగ్గింపు వలన గల్ఫ్ దేశాలలోని 88 లక్షల మంది భారతీయ కార్మికులకు రాబోయే కాలంలో ఆర్థికంగా నష్టం జరుగుతుందని, ప్రధానమైన ఈ సమస్యను పార్లమెంటులో లేవనెత్తుతామని, విదేశాంగ మంత్రిని కలుస్తామని ఎంపీలు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు