ఒమన్ రోడ్లపై ఎక్కువ భారం ఉన్న ట్రక్కులతో పెద్ద ముప్పు

- February 28, 2016 , by Maagulf
ఒమన్ రోడ్లపై ఎక్కువ భారం ఉన్న ట్రక్కులతో  పెద్ద ముప్పు

        

 ఒమన్ రోడ్లపై ఎక్కువ భారం ఉన్న ట్రక్కులతో  పెద్ద ముప్పు ఏర్పడనుంది. దీంతో జాతీయ రహదారుల మీద వాహనదారులకు  ఒక ప్రధాన భద్రతా ప్రమాదం పొంచి ఉందని ఒమాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015 లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సుల్తానేట్ రహదారులపై  68 శాతం ట్రక్కులు ఉన్నాయి. ఇవి బరువు చట్టంను  అతిక్రమించి కనుగొనబడింది .గత సంవత్సరం 18.260 ట్రక్కులలో 12.410 ట్రక్కులు బరువు చట్టాన్ని అతిక్రమించిన్నట్లు తెలిసింది. అత్యంత ఉల్లంఘనలు  అల్ రుసైల్-నిజ్వా రహదారిది మొదటి స్థానం కాగా, ఆ తర్వాత  అల్ భతినహ్  తరువాత స్థానంగా గణాంకాలు వెల్లడించాయి.అలాగే, 2015 డిసెంబర్ నాటకి ఈ ఉల్లంఘనలు అత్యధికంగా 1,290 ట్రక్కులు (80 శాతం) బరువు చట్టం ను ఉల్లంఘించినట్లు నమోదయింది.ఒమాన్ రవాణా మరియు సమాచార మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుతిస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ   గతే ఏడాది  నుంచి మంత్రిత్వశాఖ సంచార వ్యవస్థ ద్వారా వస్తువులువాహకాలు పర్యవేక్షణకు తాము ఆదేశాలు జారీ చేశామన్నారు.ఈ సమస్యను చక్కదిద్దడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి అయితే, రాయల్ ఒమన్ పోలీస్ తో పాటు, మేము నూతన రోడ్లపై నియమాలు అమలు మెరుగుపరచడానికి  స్థిరమైన స్టేషన్ల ఉపయోగించనున్నట్లు ఆయన  అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com