షార్జా లో పాదాచారులకు ఐదు వంతెనలు
- February 28, 2016
ఎమరేట్స్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఐదు పాదచారుల వంతెనలు నిర్మించాలని షార్జా పట్టణ ప్రణాళిక మండలి (షార్జా అర్బన్ ప్లానింగ్ కౌన్సిల్) ఆమోదించింది. షార్జా రహదారులు మరియు రవాణా సంస్థ సహకారంతో, ఐదు పాదచారుల వంతెనలు నమూనాలు రూపొందంచాబడ్డాయి. ఈ ఐదు పాదచారుల వంతెనలు ఏమిటంటే , కింగ్ ఫైసల్ రోడ్డు, కింగ్ అబ్దుల్ అజిజ్ వీధి , అల్ ఇట్టిహాడ్ రోడ్ మరియు అల్ తావున్ రోడ్డు రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఇవి నిర్మించబడనున్నాయి. ఈ వంతెనలు ప్రత్యేక అవసరాలు ఉన్న వృద్ధ మరియు ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించనున్నాయి. లిఫ్టులు మరియు కాలి బాటలు వంతెనకు బిగించి ఉంటుంది. షార్జా పట్టణ ప్రణాళిక మండలి చైర్మన్, షేక్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్ క్యసిం ఈ సందర్భంగా మాట్లాడుతూ షార్జ ఎమిరేట్ లో పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు కోసం నాణ్యతతో కూడిన సేవలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ,అలాగే , ఈ ఐదు పాదాచారుల వంతెనల నిర్మాణ విషయంలో "మేము స్థిరంగా మద్దతు పలుకుతున్నామని , ఈ రకమైన ప్రాజెక్టుల వలన ఎంతో ఆకర్షణీయం కలిగి ఉంటాయని అన్నారు. వీటిని షార్జా పట్టణ ప్రణాళిక మండలి పటిష్టంగా రూపొందించడంలో ఎంతో ముఖ్య ప్రాధాన్యత ఉంది.షార్జా నగరంలో ప్రధాన రహదారులు వద్ద పాదచారుల భద్రత మెరుగుపడే విధంగా వీటి ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







